తెలంగాణ టాప్‌ పెర్ఫార్మర్‌ : పీయూష్‌ గోయెల్‌

53
startup
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్‌ స్టార్టప్‌ ర్యాంకింగ్‌-2021లో తెలంగాణ టాప్‌ పెర్ఫార్మర్‌ తెలంగాణ రాష్ట్రం అవతరించింది. డిపార్డుమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ), స్టార్టప్‌ ఇండియా ఆధ్వర్యంలో వివిధ క్యాటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో నెగ్గి, తెలంగాణ ఈ అవార్డును కైవసం చేసుకొన్నదన్నారు. టాప్‌ పెర్ఫార్మర్‌ క్యాటగిరీలో తెలంగాణతో పాటు కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జమ్ము-కశ్మీర్‌ అత్యున్నత పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలుగా గుర్తింపుపొందాయన్నారు. సోమవారం ఢిల్లీలో స్టేట్‌ స్టార్టప్‌ ర్యాంకింగ్‌-2021 జాబితాను విడుదల చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌.. ఈ అవార్డును తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ప్రతినిధి శాంతకు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గోయల్‌ మాట్లాడుతూ.. స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించడంలోనూ, అధునాతన ఎకోసిస్టమ్‌ను ఎర్పరచి, నిర్మించడంలోనూ తెలంగాణ ముందంజలో ఉంటుందని ప్రశంసించారు.

తెలంగాణ ప్రభుత్వం సైన్స్‌, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ హైదరాబాద్‌ (రిచ్‌) పేరుతో ఇంక్యుబేటర్‌ను ప్రారంభించడమే కాకుండా అనేక కార్యక్రమాలను కొనియాడారు. సరికొత్త ఆవిష్కరణలకు ఇలాంటి అనుకూలమైన వ్యవస్థలు ఎంతో అవసరమన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్‌ ఫండ్‌ (టీ ఫండ్‌)ను ఏర్పాటుచేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పెట్టుబడిదారుల సహకారంతో స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా చర్యలును మెచ్చుకొన్నారు. ఇలాంటి చర్యలు స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థలో సమగ్ర, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి మూల కారకాలుగా పనిచేస్తున్నాయన్నారు పీయూష్‌ గోయల్‌.

శాంత తౌటం మాట్లాడుతూ.. తెలంగాణ ఇప్పటివరకు 3 వేల స్టార్టప్‌ల నెట్‌వర్క్‌తో ఒక తయారీ కేంద్రంగా మారిందన్నారు. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ నివేదికలో పనితీరు విభాగంలో 4వ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన మూడు స్టార్టప్‌లు నేషనల్‌ స్టార్టప్‌ అవార్డ్స్‌-2020ను గెలుచుకున్నాయన్నారు. టాప్‌ పెర్ఫార్మర్‌ అవార్డుతో పాటు ఇన్‌స్టిట్యూషనల్‌ చాంపియన్‌, ఇన్నోవేటివ్‌ లీడర్‌, ఇంక్యుబేషన్‌ హబ్‌, కెపాసిటీ బిల్డింగ్‌ పయనీర్‌ అంశాల్లోనూ జాతీయ స్థాయిలో స్థానం దక్కిందని తెలిపారు.

- Advertisement -