- Advertisement -
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించారు సీఎం కేసీఆర్.
గత నెల రోజుల్లో 2.55 లక్షల మందికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ. ర్యాపిడ్ యాంటీజెన్ పద్ధతిలో పరీక్షలు టెస్టులు నిర్వహించడం జూలై 8న ప్రారంభంకాగా ఆగస్టు 8వ తేదీ వరకు కోవిడ్ నిర్ధారణ కొరకు 5,90,306 మందికి వైరస్ పరీక్షలు
నిర్వహించారు. ఇందులో రాపిడ్ టెస్టులు 2.55 లక్షల మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 84,544గా ఉండగా 22,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 61,294 మంది కరోనా మహమ్మారి నుండి రికవరీ కాగా 654 మంది మృతిచెందారు.
- Advertisement -