సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం…

308
palabhishekam
- Advertisement -

ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రూ. 2000, 25 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రైవేట్ టీచ‌ర్లు.

హైదరాబాద్ అంబ‌ర్‌పేట‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు బడేసాబ్, ఉపాధ్యాయులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రమేష్, సురేష్, రాఘవేంద్ర, వాసవి, ఇందిరా, శైలజ, కావ్య, వరకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషోర్ గౌడ్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో ప్ర‌యివేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను సీఎం గ‌మ‌నించి, ఆర్థిక సాయం, బియ్యం అందించేందుకు నిర్ణ‌యం తీసుక‌న్నార‌ని తెలిపారు.

- Advertisement -