జూ.ఎన్టీఆర్‌పై వర్మ సంచలన వ్యాఖ్యలు..!

160
rgv

ప్రముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌ వర్మ నిత్యం వివాదాల‌తోనే హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. తాజాగా వర్మ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో యంగ్ హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అక్కినేని అఖిల్ ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. ఇందులో ఎన్టీఆర్,‌ అఖిల్‌లు స‌ర‌దాగా మాట్లాడుకుంటున్న‌ట్లు ఉంది. అయితే, ఆ స‌మ‌యంలో అఖిల్‌ తొడపై చేయి వేసి జూనియ‌ర్ ఎన్టీఆర్ గిల్లే ప్ర‌య‌త్నం చేశాడు.

దీంతో అఖిల్ అలా చేయొద్ద‌న్నట్లు ఎన్టీఆర్ చేతిని త‌న తొడ‌పై నుంచి తీసేశాడు. ఎన్టీఆర్ అంత‌టితో ఊరుకోకుండా మ‌రోసారి అఖిల్ తొడపై చేతిని వేసే ప్ర‌య‌త్నం చేయగా, అఖిల్ నవ్వుతూ సిగ్గుపడుతూ క‌న‌పడ్డాడు. ఈ వీడియోను రామ్ గోపాల్ వ‌ర్మ పోస్ట్ చేసి, ‘ఇక హీరోయిన్ల భవిష్యత్తు చాలా బాధాక‌రం’ అంటూ కామెంట్ చేశారు. గతంలోనూ ప‌లువురు హీరోల‌పై రామ్ గోపాల్ వ‌ర్మ ఇటువంటి ఫొటోలు, వీడియోల‌ను పోస్ట్ చేసి వారికి చుర‌క‌లంటించారు. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజ‌న్స్ భిన్న‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.