జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎవరెంత డిపాజిట్‌ చేయాలో తెలుసా..!

339
panchayat polls nominations
- Advertisement -

స్ధానిక సంస్థల ఎన్నికల సంగ్రామం మొదలైంది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలివిడతలో భాగంగా నేటి నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 6న పోలింగ్ జరగనుండగా మే 27న ఫలితాలను విడుదల చేయనున్నారు. తొలి విడుతలో భాగంగా 32 జిల్లాల్లో 197 జడ్పీటీసీ, 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఎంపీటీసీ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.లక్షన్నర, జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు ఖర్చు చేయవచ్చు.. జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.2,500లు, ఎంపీటీసీ జనరల్ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1,250 డిపాజిట్ చెల్లించాలి. ఇక నామినేషన్ల దాఖలు సమయంలోనే ప్రచార ఖర్చు నిర్వహణకు బ్యాంకు పాస్‌బుక్ తప్పనిసరిగా ఉండాలి.

రోజువారీగా ఎన్నికల ప్రచార ఖర్చు లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 28 నుంచి ప్రచారం ఖర్చులు లెక్కలోకి వస్తాయి. విద్యార్హతలు, ఆస్తులు, నేరచరిత్రపై సెల్ఫ్‌డిక్లరేషన్ తప్పనిసరిగా అందజేయాలి.బ్యాలెట్ పద్దతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనుండగా జెడ్పీటీసీ ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, ఎంపీటీసీ ఎన్నికకు తెలుపురంగు బ్యాలెట్ పేపర్ కేటాయించారు.

ఇక ఇప్పటికే ప్రధాన పార్టీల నుండి పోటీచేసే వారు నామినేషన్ల దాఖలులో బిజీగా ఉండగా అధికార టీఆర్ఎస్ నుండి పోటీచేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావాహులు ఆసక్తికనబరుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అన్‌లైన్‌లో అప్లై చేసిన అనంతరం ప్రింట్ అవుట్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.

మొదటి దశ ఎన్నికలు
నోటిఫికేషన్ తేదీ – ఏప్రిల్ 22
పోలింగ్ తేదీ – మే 6

రెండో దశ ఎన్నికలు
నోటిఫికేషన్ తేదీ – ఏప్రిల్ 26
పోలింగ్ తేదీ – మే 10

మూడో దశ ఎన్నికలు
నోటిఫికేషన్ తేదీ – ఏప్రిల్ 30
పోలింగ్ తేదీ – మే 14

- Advertisement -