తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే వాహనాలు, ఫైళ్ల తరలింపు త్వరితగతిన చేపట్టిన అధికారులు పాత సచివాలయం కూల్చివేత పనులను వేగవంతం చేశారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు సాగుతుండగా సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.
ఇక తాజాగా కొత్త సచివాలయం డిజైన్ విడుదలైంది. త్వరలోనే ఈ డిజైన్‌కు సీఎం కేసీఆర్ అమోదముద్ర వేయనుండగా ఆరు అంతస్తుల్లో కొత్త సచివాలయం నిర్మాణ పనులు జరగనున్నాయి.
దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో సమీకృత సచివాలయం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 6 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల సమావేశాల కోసం అధునాతన హాల్స్ నిర్మాణం….మంత్రుల పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీస్‌లు ఏర్పాటు చేయనున్నారు.
ఏడాది క్రితమే నూతన సచివాలయం నిర్మాణానికి శంకుస్ధాపన చేసిన కొంతమంది కోర్టుల్లో కేసులు వేయడంతో ఆలస్యమైంది.