సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన సచివాలయం ప్రారంభమమైంది. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం. బ్యాటరీ కారులో సచివాలయం లోపలకు వెళ్లారు సీఎం.ఇక అంతకముందు నూతన సచివాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు కేసీఆర్. సీఎం వెంట సీఎస్ శాంతి కుమారి,డీజీపీ అంజన్ కుమార్, మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
అనంతరం తన చాంబర్‌లో ఆశీన్నులయ్యారు సీఎం. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక తొలి సంతకాన్ని పోడు భూముల ఫైలుపై చేశారు సీఎం.
Also Read:మే నెల..బ్యాంకు సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
మేయిన్ గేట్ వద్ద సీఎం కేసీఆర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడినుంచి నడుకుంటూ వెళ్లిన ముఖ్యమంత్రి యాగశాలను సందర్శించారు. యాగశాలలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Also Read:నూతన సచివాలయం..ట్రాఫిక్ ఆంక్షలు

