2023లో సినిమా చూపిస్తాం:కేటీఆర్‌

56
- Advertisement -

సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన రైతు కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్‌ బీజేపీపై విరుచుకుపడ్డారు. 2022లో ట్రైలర్ చుశారు… 2023లో సినిమా చూపిస్తామన్నారు. సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంత‌కు ముందు తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాన్ని కేటీఆర్ అవిష్క‌రించారు.

రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.1.68లక్షల కోట్లు వెళ్లాయని, కేంద్రం తెలంగాణకు రూ.2లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. సిరిసిల్ల నుంచి విజయయాత్ర ప్రారంభించుకుందామని అన్నారు. కరీంనగర్‌ నుంచే గులాబీ జెండా ఎగురవేద్దామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, తెలంగాణ పవర్‌లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, మున్సిపల్ చైర్ పర్సన్లు జిందం కళా చక్రపాణి, రామతీర్థపు మాధవి, సెస్ ఎండీ రామకృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

కొత్త ట్రెండ్‌…నో ట్రౌజర్స్‌ డే

మొక్కలు నాటిన సుంకె దీవెన

మొక్కలు నాటిన రామడుగు పాక్స్ చైర్మన్‌

- Advertisement -