టెక్స్‌టైల్‌ రంగానికి ఊతమివ్వాలి:కేటీఆర్‌

54
- Advertisement -

తెలంగాణలోని టెక్స్‌టైల్‌ రంగానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలని రాష్ట్ర చేనేత, జౌళీశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని కేంద్రంకు ఒక లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్‌లో గత కొన్నేళ్లుగా తెలంగాణకు అందుతున్నది శూన్యమని, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు, సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌కు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నేతన్నల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని కోరినా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. దీంతో పాటుగా టెక్స్‌టైల్‌ చేనేత రంగంపై జీఎస్టీని పూర్తిగా రద్ధు చేయాలన్నారు. బ్లాక్‌ లెవల్‌ హ్యాండ్‌లూం క్లస్టర్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలన్నారు. నేతన్నల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నానన్నారు.

ఇవి కూడా చదవండి…

యాదాద్రికి రాష్ట్రపతి..బ్రేక్ దర్శనాలు రద్దు

రిచెస్ట్‌ సీఎమ్స్‌ ఇన్ ఇండియా…

టీడీపీతో పొత్తు.. పవన్ క్లారిటీ ఇస్తారా?

 

- Advertisement -