ధరణితో రైతు కష్టాలు దూరం:హరీశ్

224
- Advertisement -

ధరణితో తెలంగాణలోని భూసమస్యలు తగ్గిపోయాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైన డోంగ్లి మండలాన్ని ఆర్ధిక మంత్రి హారీశ్‌రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి హారీశ్‌రావు మాట్లాడుతూ… మండల కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. డోంగ్లి మండలం ఏర్పాటు ఎన్నో ఏళ్ల కల. ఆ కలను నిజం చేసింది సీఎం కేసీఆర్ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 466 మండలాలను 612 కుపెంచామ‌న్నారు.

ధరణి పోర్ట‌ల్ గురించి తెలుసుకోకుండా కొంత మంది మూర్ఖులు ఏదేదో వాగుతున్నార‌ని మండిప‌డ్డారు. రూపాయి లంచం లేకుండా పట్టా పాస్ పుస్తకాలు ఇంటికి వస్తున్నాయి. త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వ‌హించి, భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారిస్తామ‌న్నారు. ధరణితో అవినీతి తగ్గి… పారదర్శకత పెరిగిందన్నారు. వేగవంతమైన పాలన అందుతుంద‌ని మంత్రి హ‌రీశ్ రావు స్ప‌ష్టం చేశారు. ఇత‌ర రాష్ట్రాల అధికారులు కూడా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను చూసి చాలా నేర్చుకున్నార‌ని తెలిపారు.

టీఆర్ఎస్ వచ్చాకే నీళ్ళ బాధలు పోయాయ‌ని మంత్రి గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచామ‌న్నారు. హర్ ఘ‌ర్ కో జల్ పేరిట దేశం మొత్తం అమలు చేస్తున్నారు. చెరువులు బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అన్నారు. రైతు బంధు కాపీ కొట్టి, కిసాన్ సమ్మన్ యోజన ద్వార ఇస్తున్నారు. నాందేడ్ నుండి సర్పంచులు వచ్చి మమ్మల్ని తెలంగాణలో కలపాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశార‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి…

పాదయాత్రలు కాదు..రిలే యాత్రలు!

దివ్యాంగులకు అండగా టీఎస్ సర్కార్..

రేపే భారత్‌ బంగ్లాతో డీ…

- Advertisement -