సౌదీలో నిజామాబాద్ వాసి‌ మృతి…అంత్యక్రియలకు జాగృతి సాయం

219
Saudi Arabia
- Advertisement -

సౌదీ అరేబియాలో ఇటీవల కరోనాతో మృతి చెందిన నిజామాబాద్ కు చెందిన మహమ్మద్ అజ్మతుల్లా అంత్యక్రియలు మంగళవారం మక్కాలో జరిగాయి. అయితే సౌదీ లో కర్ఫ్యూ కారణంగా మహమ్మద్ అజ్మతుల్లా కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొనే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ జాగృతి నాయకులు ముందుకు వచ్చారు. సౌదీ చట్టాల ప్రకారం అంత్యక్రియలకు కావలసిన ప్రక్రియలను పూర్తి చేసారు.

సౌదీ లోని మక్కాలో గత 35 ఏళ్లుగా పనిచేస్తున్న నిజామాబాద్ కు చెందిన మహమ్మద్ అజ్మతుల్లా అలియాస్ ‌సాజిద్ గత కొన్ని రోజులుగా‌ జ్వరంతో బాధపడుతున్నాడు. తొలుత కరోనా లక్షణాలు ఏవీ కనిపించలేదు. చివరకు స్నేహితుల సూచనలతో మక్కాలోని ఆస్పత్రిలో చేరి, గురువారం ఉదయం కరోనాతో మరణించాడు. మృతుడి నలుగురు పిల్లలూ‌ సౌదీ లేని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ కర్ఫ్యూ కారణంగా మక్కాలోని తండ్రి మృతదేహం దగ్గరికి వెళ్లలేకపోయారు. దీంతో అంత్యక్రియలకు సంబంధించిన ప్రక్రియలు పూర్తి చేసేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

అయితే తెలంగాణ ‌జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎంపీ ‌కవిత‌ సూచన మేరకు, తెలంగాణ జాగృతి సౌదీ అరేబియా నాయకులు మౌజం అలీ ఇఫ్తెకార్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. సామాజిక కార్యకర్త ముజీబ్ సహకారంతో సంబంధిత పత్రాలు ‌సమర్పించి, అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేశారు. అయితే ‌ తమ తండ్రిని ‌కడసారి చూసుకోలేకపోయినా, కుటుంబ సభ్యుల్లా భావించి అంత్యక్రియలకు అన్నీ‌ తానై వ్యవహరించిన తెలంగాణ జాగృతి నాయకులకు‌ మహమ్మద్ ‌అజ్మతుల్లా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -