కేసీఆర్ జిందాబాద్‌ అంటున్న బీహార్ వాసులు..

300
cm kcr
- Advertisement -

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా వలస కూలీలు ఎన్నో అవస్తలు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు కరోనా భయంతో మూట ముల్లె సర్థుకుని కాలి నడకన స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే తెలంగాణలో మాత్రం వలస కూలీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్‌ వారిని సోంత బిడ్డల్లా ఆదుకుంటున్నారు.వారి కావల్సిన సదుపాయాలు కల్సిస్తు కంటికి రెప్పాలా కపాడుతున్నారు.

తెలంగాణలో బీహార్‌ నుంచి వేలాది మంది కూలీలు హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. లాక్‌డౌన్‌లో తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.ముఖ్యంగా నిత్యావసర సరుకులు కొరత లేకుండా అందరికీ అందించింది. మసాల దినుసుల కానుంచి బియ్యం వరకు… ఉప్పు, పప్పు కూరగాయలు… అన్నీ ఇస్తోంది.

అయితే ఓ బీహార్ వాసి తనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన నిత్యావసర వస్తువులను చూపిస్తు కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. మేము బీహార్‌కు పోము ఇక్కడే ఉంటాం అంటు కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. కూలీలంతా కేసీఆర్‌ సర్కార్‌కు జిందాబాద్‌ అంటు నినాదాలు చేశారు. ఈ వీడియోను ఎంపీ సంతోస్‌ కుమార్‌ తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

- Advertisement -