లాక్ డౌన్.. మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి..

503
trees
- Advertisement -

సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికీ 158కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఓఆర్ఆర్ పై గ్రీనరీ, 28 నర్సరీలు, 16 అర్బన్ ఫారెస్ట్ బ్లాకులను హెచ్ఎండీఏలోనీ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అభివృద్ది చేస్తుండగా గ్రీనరీ, మొక్కల సంరక్షణకుప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ మేరకు 136 వాటర్ ట్యాంకర్లకు పోలీసు అధికారులు ఇచ్చిన వెహికిల్ పాస్ ల ద్వారా స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేక అనుమతులు తీసుకుని మొక్కలకు నీళ్లు పెడుతున్నారు.

అదేవిధంగా సర్వీస్ రోడ్ల వెంబడి ఉన్న ప్లాంటేషన్, రైల్వే కారిడార్, ఓపెన్ స్పేస్ లలో ఉన్న మొక్కలకు నీళ్లు అందిస్తూ వేసవిలో మొక్కలు వాడిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. ఓఆర్ఆర్ వెంబడి ఉండే గ్రామాలకు చెందిన కార్మికులతోనే వాటరింగ్ ప్రక్రియ జరుగుతుందనీ హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు.

plants

- Advertisement -