బన్నీ బర్త్‌డే ఫస్ట్‌ లుక్‌..

87
allu arjun

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కాగా అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. లాక్ డౌన్ ఎత్తివేయగానే ఈ సినిమా షూటింగు మొదలుకానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేస్తారా? అనే విషయంలో అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Bunny

గతంలో సుకుమార్ – బన్నీ కాంబినేషన్లో ‘ఆర్య’ .. ‘ఆర్య 2’ సినిమాలు వచ్చాయి. ఆ సెంటిమెంట్ ప్రకారమే తాజా చిత్రానికి కూడా రెండు అక్షరాల టైటిల్ నే సెట్ చేసే ఉద్దేశంతో సుకుమార్ వున్నాడని అంటున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నారు. ఆ రోజున టైటిల్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.