- Advertisement -
కేంద్ర ప్ఱభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కంటైన్‌మెంట్ జోన్లలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ఉంటుందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. దవాఖానలు, మందుల దుకాణాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య సముదాయాలు రాత్రి 9.30 వరకు తమ కార్యకలాపాలను ముగించాలని పేర్కొంది.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు లాక్ డౌన్ అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర సేవలకు మాత్రమే కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
- Advertisement -