వెంకయ్యకు బర్త్ డే విషెస్ తెలిపిన సీఎం కేసీఆర్…

107
cm kcr

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి బర్త్ డే విషెస్ తెలిపారు సీఎం కేసీఆర్. ఈ మేరకు ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసిన సీఎం…నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని…దేశానికి మరింతకాలం సేవలందించాలని ఆకాంక్షించారు.

1949 జులై 1న వెంకయ్యనాయుడు జన్మించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజా హై స్కూల్ లో పదో తరగతి వరకు విద్యనభ్యసించిన ఆయన,వీఆర్ కళాశాలలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్శిటీలో న్యాయవిద్య అభ్యసించారు. చిన్నానాటి నుంచే ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న వెంకయ్యనాయుడు, ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా పని చేశారు. జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వెంకయ్యనాయుడు, నాటి ఎమర్జెన్సీ సమయంలోనూ నిరసన గళం వినిపించారు.

1978లో ఉదయగిరి నుంచి అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. 1983 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1996 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా, 1998, 2004, 2010లో రాజ్యసభ సభ్యుడిగా,1999లో వాజ్ పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఆయన పని చేశారు. 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, 2014లో కేంద్ర పట్టణాభివృద్ది శాఖా మంత్రిగా వెంకయ్యనాయుడు పని చేశారు.