- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి మాచారెడ్డి మండల అధ్యక్షులు కామాటి శేఖర్ మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరు.. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కామాటి శేఖర్ పిలుపునిచ్చారు.
ఒక మనిషి మొక్క నాటితే… తన జీవిత కాలానికి సరిపడా ఆక్సిజన్‌ను అవి అందిస్తాయని తెలిపారు. తెలంగాణను ప్రకృతికి పర్యావరణానికి చిరునామాగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సభ్యులు రాజేందర్,మల్లేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -