క్రీడా హబ్‌గా తెలంగాణ: శ్రీనివాస్ గౌడ్

237
srinivas goud
- Advertisement -

సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను క్రీడా హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నాం అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రవీంద్రభారతిలోని తన ఛాంబర్‌లో క్రీడాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేడియాలను క్రీడల కోసమే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. క్రీడాశాఖ ఆదాయ వనరులు పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు.

స్పోర్ట్స్ హాస్టల్స్ ను వసతులు పెంచుతూ..అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లను తయారు చేయాలన్నారు. స్టేడియాల అభివృద్ధితో పాటు, మరమ్మతులు శరవేగంగా పూర్తి చేయాలన్నారు, క్రీడా ప్రాంగణాలను పిపిపి Model లో ఆధునీకరించి ఆదాయ వనరులుగా మార్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు.. రానున్న రోజుల్లో క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో క్రీడాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, ఓఎస్డీ విమలాకర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -