సర్వతోముఖాభివృద్ధిని సాధించుకుంటున్నాము : కేటీఆర్‌

94
ktr alpla
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఆధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఏంతగానో పారిశ్రామికంగా ముందు సాగుతుందన్నారు మంత్రి కేటీఆర్‌. పటాన్‌చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో అల్‌ప్లా ఇండియా పరిశ్రమలో వరల్డ్‌ క్లాస్‌ మౌల్డ్ యూనిట్‌ను, డ్యూయల్‌ ఎడ్యుకేషన్‌ ను ప్రారంభించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలపై పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అన్ని రకాల సహయ సహాకారాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం వల్ల జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు అధికంగా ఉందన్నారు. తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామన్నారు. దిగుమతులు తగ్గించి, స్థానికంగానే ఉత్పత్తిని పెంచి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో….. తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఐదు విప్లవాలు తీసుకొచ్చమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. దీనివల్ల దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింద‌న్నారు. నీలి విప్లవంతో మన దేశ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో చేపల ఉత్పత్తి ఉందన్నారు. క్షీర విప్లవంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగడం ద్వారా…. అప్పులతో మూతపడే దశలో ఉన్న విజయా డైరీ నేడు ప్రభుత్వానికి డివిడెంట్ల్ ఇచ్చే స్థాయికి ఎదిగింద‌న్నారు. రాష్ట్రంలో గులాబీ విప్లవంతో మాంసం ఉత్పత్తి కూడా పెరిగింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. పసుపు విప్లవంలతో రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తి పెరుగుతుందన్నాయన…. వచ్చే ఐదేండ్లో 25లక్షల ఎకారాల్లో ఆయిల్‌ఫామ్‌సాగు లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక సబ్సీడీలు ఇస్తుందని మంత్రి కేటిఆర్‌ స్పష్టం చేశారు.

- Advertisement -