ఎన్టీఆర్‌ని మోసం చేసిన ఎన్నారై మహిళ!

9
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్‌ని మోసం చేశారు ఓ ఎన్నారై మహిళ. ఒక ల్యాండ్‌కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ఓ ప్లాట్ ని 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుండి ఎన్టీఆర్ ప్లాట్ కొనుగోలుచేశారు. అయితే అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా లోన్స్ తీసుకుంది గీతలక్ష్మి కుటుంబం. కానీ ఈ విషయాన్ని ప్లాట్ అమ్మే సమయంలో దాచిపెట్టి ఎన్టీఆర్‌కు అమ్మారు.

కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పగా ఆ బ్యాంక్‌లో లోన్ క్లీయర్ చేసి డాక్యుమెంట్స్ తీసుకున్నారు తారక్‌. అప్పటి నుండి ఫ్లాట్ ఓనర్‌గా ఉంటున్న తారక్‌ కు పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది. ప్రాపర్టీను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నించడంతో బ్యాంకు మేనేజర్లపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్.

2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ నమోదు చేసారు. తాజాగా DRTలో Debt Recovery Tribunal జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది. దీనిపై జూన్ 6న విచారణ చేపడతామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.

Also Read:ఓడిపోయినా CSK అర్హత సాధిస్తుందా?

- Advertisement -