మహాకూటమి అభ్యర్దులకు డిపాజిట్లు కూడా రావన్నారు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ 100కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో నాయిని మాట్లాడారు. ఈసారి జరిగే ఎన్నికల్లో నల్లగొండలో 12కి12 స్ధానాలు గెలుస్తామన్నారు స్ధానాలు గెలుస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకంతో దేవరకొండ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీసేది లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు కేంద్ర ప్రభత్వానికి లేఖలు రాసి అడ్డుకుంటాన్నారుని మండిపడ్డారు. అలాంటి చంద్రబాబుతో ఇప్పుడు కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. దేవరకొండ టీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్రకుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.