తెలంగాణ‌లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ రికార్డు..

13

కొవిడ్ వ్యాక్సినేష‌న్ మొద‌టి డోస్ 100% పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా రికార్డు నెలకొల్పిన తెలంగాణ‌,ఇప్పుడు మ‌రో మైలు రాయిని చేరుకున్నది. రాష్ట్రంలో కొవిడ్ వాక్సినేషన్ నేటితో 5 కోట్ల డోసులను అధిగ‌మించింది. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిరంతరం కృషి చేస్తున్న వైద్యారోగ్య సిబ్బందితోపాటు పంచాయతీ, మున్సిపల్, ఇత‌ర శాఖ‌ల సిబ్బందికి మంత్రి హరీష్‌ రావు అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సినేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకొని, మీ కుటుంబాన్ని,సమాజాన్ని కరోనా నుండి సంరక్షించండి అని ఆయన కోరారు.