మాస్‌ అవతార్‌లో వైష్ణవ్‌ తేజ్‌..!

23

మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇటీవల వైష్ణవ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియో రూపంలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. వైష్ణవ్‌ తేజ్‌ సరికొత్త మాస్‌ క్యారెక్టర్‌ చేయనున్నారని ఈ వీడియో చూడగానే అర్థమవుతుంది. భారీ స్థాయిలో నిర్మాణం జరుపుకొనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు నిర్మాతలు.