రాష్ట్రంలో 68 జూనియర్‌ కాలేజీల గుర్తింపు రద్దు..

285
TSBIE
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో పలు జూనియర్‌ కాలేజీల గుర్తింపు ఇంటర్‌ బోర్డు రద్దు చేసింది. నిబంధనలు పాటించని కళాశాలలపై హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్‌ బోర్డు చర్యలు తీసుకుంది. నిబంధనలు పాటించని, అనుమతులు లేని 68 కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు ఆయా కాలేజీలకు నోటీసులు జారీ చేసింది.

నారాయణ 26, శ్రీచైతన్య 18 సహా 68 కాలేజీలను ఇంటర్‌ బోర్డు మూసివేసింది. కాలేజీల గుర్తింపు రద్దు చేస్తూ మూసివేస్తున్నట్లు ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్‌బోర్డు.. ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందించింది.

- Advertisement -