చివరి నిమిషంలో వస్తే ఎలా..గణేష్ నిమజ్జనంపై హైకోర్టు

9
- Advertisement -

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన వివాదంపై ఏటా చివరి క్షణంలో కోర్టును ఆశ్రయిస్తే ఎలా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది హైకోర్టు . వినాయక చవితికి ముందు పిటిషన్లు వేసి, కోర్టుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం సరికాదని తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.

హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు కథనాలు వచ్చాయని, వీటిపై చర్యలు తీసుకోవాలన్నారు పిటిషనర్. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిషేధంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఏడాదిగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. చివరి క్షణంలో కోర్టుకు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తే ఎలా అని … అయినా ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యమేనని, దీనిపై తామే విచారణ చేపడతామంటూ ఈ నెల 9కి విచారణను వాయిదా వేసింది.

హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ, కోర్టు ధిక్కరణ కింద దీన్ని పరిగణించాలంటూ న్యాయవాది మామిడి మాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. నెంబరు కేటాయింపులో రిజిస్ట్రీ అభ్యంతరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Also Read:వర్షాల ఎఫెక్ట్..561 రైళ్లు రద్దు

- Advertisement -