రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత దినదినంగా క్రమేపి గా పెరుగుతుంది.7-3-25, 8-3-25. రెండు రోజులు ఎండ తీవ్రత నార్మల్ స్థాయిలో ఉంటుంది.9-3-25 నుండి 11-3-25. వరకు ఎండ ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలో పెరుగుతుంది.
ఉదయం సమయంలో రానున్న రెండు రోజులు కొద్దిగా చలి వాతావరణం ఉంటుంది. ఉదయం గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం పొగ మంచుతో చలి నమోదవుతుంది.ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
సెంట్రల్ జోన్ గా హైదరాబాద్ 38.6° ఉష్ణోగ్రత రానున్న ఐదు రోజుల్లో తీవ్రస్థాయిలో పెరగనుంది. అత్యధికంగా ఎండ ఉష్ణోగ్రత నమోదైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం.38.8°, అదిలాబాద్.37°,రామగుండం 37.4°, నిజామాబాద్36.°, జయశంకర్ భూపాలపల్లి 36°,మెదక్ 38°, మహబూబ్నగర్ 36°
, నల్గొండ36°ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, తగిన నీరు, టూ వీలర్స్ పైన జర్నీ చేయొద్దు, అవుట్ డోర్ ప్లాంట్స్ ఇలాంటివి నిలిపి వేసుకుంటే ఎండ మారినా పడకుండా ఉంటారు.
Also Read:ప్రధాని మోదీకి బార్బడోస్ పురస్కారం

