తెలంగాణ చేనేత రంగం అభివృద్ధి భేష్‌:ఒడిశా మంత్రి రీటా సాహు

63
- Advertisement -

తెలంగాణ హ్యాండ్‌లూమ్‌ టెక్స్‌టైల్‌ రంగంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నేతన్నల సంక్షేమ పథకాల అమలు ఒడిశా మంత్రి రీటా సాహు అభినందించారు. రాష్ట్ర చేనేత, జౌళీశాఖ మంత్రి కే తారకరామారావుతో.. ఒడిశా చేనేత జౌళీశాఖ మంత్రి రీటా సాహుతో పాటు అధికారుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా టెక్స్‌టైల్‌, చేనేత రంగంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, నేతన్నల సంక్షేమ కార్యక్రమాలపై ఒడిశా బృందం అధ్యయనం చేసింది.

హైదరాబాద్ లో తెలంగాణ టెక్స్‌టైల్‌ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ నేతన్నల సంక్షేమం, టెక్స్‌టైల్ చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన అనేక కార్యక్రమాలపై వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రెట్లు భారీగా పెంచిన టెక్స్‌టైల్‌ శాఖ బడ్జెట్ నుంచి మొదలుకొని చేనేత కార్మికులకు అవసరమైన ముడిసరుకుపై ఇచ్చే సబ్సిడీ, నేతన్న అందిస్తున్న బీమా సౌకర్యం, రాష్ట్రం పవర్ లూమ్ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా, ప్రతిష్టాత్మక బతకమ్మ పండగకు ఆడబిడ్డలకు కానుక ఇచ్చేలా ద్విముఖ వ్యూహంతో చేపట్టిన బతుకమ్మ చీరెల కార్యక్రమం అనేక కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు.

తెలంగాణ టెక్స్‌లైట్‌ శాఖ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఒక నివేదికను తమకు అందిస్తే తమ రాష్ట్రంలో ఆయా కార్యక్రమాలను అమలు చేసే అంశాన్ని ఒడిశా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తమ రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా మంత్రి కే తారకరామారావుని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. ఒడిశా మంత్రి రీటా సాహు, అధికారుల అధికారుల బృందాన్ని చేనేత శాలువలు, ఫిల్లిగ్రి ఉత్పత్తులతో సన్మానించారు.

- Advertisement -