తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికి తెలంగాణ గ్రామీణం ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. తొర్రూరులో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అంతకుముందు ఏనుగల్లులో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దాదాపు 20వేల మంది మహిళలతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మహిళ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చే రూ.750కోట్లు అభయహస్తానికి సంబంధించిన రూ.545కోట్ల తొర్రూరు మహిళ సాక్షిగానే ఇస్తున్నామని అన్నారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ సందర్భంలో అవార్డులు ప్రకటించినా తెలంగాణే ముందువరుసలో ఉంటుందన్నారు. దానికి కారణం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అని అన్నారు.
ఒక్కో గ్రామంలో ట్రాక్టర్ ట్యాంకర్ రాష్ట్రంలోని 12వేలకు పైగా గ్రామాల్లో ఉన్నాయని అన్నారు. ఎటుచూసిన పచ్చటి చెట్లు జలకళతో చెరువుల శోభ ఇదంతా కేవలం సీఎం కేసీఆర్‌దే ఘనత అని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని అభివృద్ధి చేయడం సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకం ఉద్దేశమని అన్నారు. అయితే ఈ పథకం కింద దేశంలోనే ఉత్తమమైన 20గ్రామపంచాయితీలు ఎక్కడ ఉన్నాయంటే అందులో 19మన తెలంగాణలో ఉన్నాయన్నారు.
త్రీస్టార్ ఫోర్‌స్టార్ పేరుతో జిల్లాలకు స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకింగ్స్ రేటింగ్స్ వచ్చాయన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రంలో ఏగ్రామానికి వెళ్లినా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పంచాయితీరాజ్ శాఖ అద్భుతమైందన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారులు పల్లెల కోసం పనిచేస్తున్నారంటే అది కేవలం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పని చేస్తున్నందుకే అవార్డులు వస్తున్నాయి అని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి…
అంతా ఆరోజే.. వాట్ నెక్స్ట్ పవన్!
దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా..ఈడీ నోటీసులపై కవిత
బక్ముత్ దిశగా రష్యా సేనలు..!