బక్ముత్ దిశగా రష్యా సేనలు..!

35
- Advertisement -

ఉక్రెయిన్‌లోని అతిముఖ్యమైన నగరాన్ని ఆక్రమించే దిశగా రష్యా సేనలు ముందుకు కదులుతున్నట్టుగా యూఎస్ మీడియా కథనం పేర్కొంది. తూర్పు ఉక్రెయిన్‌లోని బక్ముత్‌ నగరంను రష్యా ఆక్రమిస్తే ఉక్రెయిన్‌పై పూర్తి గుత్తాధిపత్యం సాధిస్తుందని తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. దొనెట్స్క్‌ దిశగా బక్ముత్‌ నుంచి ఇతర నగరాలకు చొచ్చుకొనిపోవడానికి బక్ముత్‌ నగరం కీలకంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఈ నగరం పుతిన్ సేనల ముట్టడిలో ఉంది.

జెలెన్‌స్కీ అంతర్జాతీయ మీడియా మట్లాడుతూ…ఇటీవల భద్రతా బలగాల చీఫ్‌తో సమావేశమయ్యాను. బక్ముత్‌ వద్ద గట్టి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం గురించి చర్చించామని తెలిపారు. కానీ మేం మా సైనికులు ప్రాణాల గురించి ఆలోచించాలి. అలాగే ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలి.అక్కడి నుంచి రష్యా ఏం కోరుకుంటుందో మొదట అర్థం చేసుకోవాలి. రష్యా ఏడాది కాలంగా ఉక్రెయిన్‌పై దాడి చేస్తుంది. ఇరుపక్షాల తరపున భారీ స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో విజయం సాధించాలంటే పుతిన్ దాడులను మరింత తీవ్రం చేస్తారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇవి కూడా చదవండి…

ఉమెన్స్ డే…ఘనంగా గ్రీన్ ఛాలెంజ్

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త..

ఆడాళ్లు మీకు జోహార్లు

- Advertisement -