- Advertisement -
రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, వడగల్ల వానలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. అకాల వర్షాలు పడుతుండడంతో వాటి ప్రభావం పై ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషీతో మాట్లాడారు కేసీఆర్.
గత 15రోజులుగా పడుతున్న వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేధికను అందించాలని కేసీఆర్ ఆదేశించారు.
నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, వెంటనే నివేదికలు పంపాలని ఆదేశించారు. ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్టర్లతో జోషీ ఫోన్లో మాట్లాడారు. అధికార బృందాలు తక్షణమే గ్రామాల్లో పర్యటించి, వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే పంట నష్టాన్ని అంచానా వేసి పంపాలని ఆదేశించారు.
- Advertisement -