ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విధ్వంసం విద్యా వ్యవస్థపై ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ దాని ప్రభావం ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాలు సఫర్ అయినట్టే భారత్ కూడా అయింది. అందులో తెలంగాణకు మినహాయింపు ఏమిలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పదో తరగతి పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11పేపర్లకు బదులుగా 6పేపర్లే నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలిపింది.
కరోనా కారణంగా 2021లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఏడాది కరోనా ఉధృతి కారణంగా పరీక్షలు నిర్వహించడం వీలు కాలేదు. ఇక 2022లో విద్యాశాఖ టెన్త్ పరీక్షలు నిర్వహించింది. అప్పుడు 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు. మళ్లీ తాజాగా 2023 లోనూ 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.