చిన్నారి మృతి

195
Telangana Girl Who Fell Into Borewell is dead
- Advertisement -

చేవేళ్ల మండలం చన్వెళ్లి గ్రామ సమీపంలో బోరుబావిలో పడిపోయిన చిన్నారి మృతి చెందడంతో విషాదం నెలకొంది. 60 గంటలకు పైగా జరిగిన ప్రయాత్నాలు ఫలించలేదు. చివరికి గాలి పైపు ద్వారా మృతదేహాన్ని బయటకు తీశారు. బోరుబావిలో పడ్డ వెంటనే స్పందించి 60 గంటలకు పైగా కష్టపడ్డామని మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. పాపను రక్షించుకోలేకపోయామని, చిన్నారి మృతి చెందినట్లు ఆయన ప్రకటించారు. పాపను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. కాని మా శ్రమ ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తొలుత చిన్నారిని 40 అడుగుల దగ్గర గుర్తించాం. చిన్నారి అరుపులను కుటుంబ సభ్యులు, అధికారులు విన్నారు. 180 అడుగుల దగ్గర చిన్నారి ఉందని అనుకున్నాం. అధునాతన కెమెరాలను బోరుబావిలోకి పంపించాం. 200 అడుగుల వరకు కెమెరాలను పంపించాం. చిన్నారి మరింత లోతుకు వెళ్లినట్లు గుర్తించాం. చిన్నారి 400 అడుగుల లోతులో ఊబిలో చిక్కుకోవడంతో మృతి చెందిందన్నారు. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో పాప బోరు బావిలో పడిపోగా రాత్రి 8 గంటల నుంచి అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. సాంకేతిక సహాయంతో పాపను బయటకు తీయాలని రోబోటిక్‌ హ్యాండ్‌ క్లిప్‌, చైన్‌ పుల్లింగ్‌ టెక్నాలజీ ఉపయోగించినా ఫలితం లేకపోయింది. సింగరేణి నుంచి విపత్తు నివారణ బృందాలను రప్పించి వారి సహకారం తీసుకున్నప్పటికీ ప్రయత్నాలన్నీ విఫలయమ్యాయి.

25brk29b

చివరికి ప్లషింగ్ ప్రక్రియతో బోరుబావిలో నుంచి చిన్నారి అవయవాలు, బట్టలు బయటకు వచ్చాయి. అవయవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని మంత్రి పేర్కొన్నారు. బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ప్రకటించారు. చేవెళ్ల ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోరేపల్లి గ్రామానికి పాప మృతదేహం తరలించారు. బ్రతికి వస్తుందని అనుకున్న గ్రామస్తులు, తల్లిదండ్రులు చిన్నారి మృతి చెందడంతో విషాదంలో మునిగిపోయారు. చిన్నారి అంత్యక్రియలు గొర్రెపల్లి గ్రామంలో పూర్తయ్యాయి.

Borewell201706252

బోరు పూడ్చకుండా నిర్లక్ష్యంచేసి ప్రమాదానికి కారణమైన పొలం యజమాని మల్లారెడ్డిపై పోలీసులు సెక్షన్‌ 336 కింద కేసు నమోదుచేశారు. వాల్టా చట్టం ప్రకారం ఎవరు బోరు వేయాలనుకున్నా ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని, బోరులో నీళ్లు రాని పక్షంలో వాటిని పూడ్చివేయాల్సిన బాధ్యత యజమానులదేనని అధికారులు తెలిపారు. జిల్లాలో పూడ్చకుండా ప్రమాదకరంగా ఉన్న బోర్లను గుర్తించి వాటిని పూడ్చివేసే బాధ్యత తీసుకోవాలని రెవెన్యూ అధికారులను మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు.

- Advertisement -