తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం మే 19 వ తారీఖున లాల్‌బహదుర్ స్టేడియంలో వేల మంది హాజరైన “డైరెక్టర్స్ డే” కార్యక్రమానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయడంలో తోడ్పడినవారికి , సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపింది తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం.
1. మాకు అడుగడుగునా సహాయసహకారాలు అందించి ప్రభుత్వ యంత్రాంగానికి.
2. ఇంత పెద్ద ఈవెంట్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అడుగడుగునా సహకరించిన పోలీసు యంత్రాంగానికి,
3. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చాకచక్యంగా ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించిన ట్రాఫిక్ పోలీసు విభాగానికి
4. ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అనుక్షణం సహకరించిన లాల్ బహదుర్ స్టేడియం యాజమాన్యానికి
5. మీడియా సంస్థలకు, మీడియా రిప్రజెంటులకు,మీడియామిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
6. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ కథానాయకులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, న్యాచురల్ స్టార్ నాని, అల్లరి నరేష్, సుదీర్ బాబు, అడవి శేషు, కార్తికేయ, ఆనంద్ దేవరకొండ గార్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు, వీరందరూ రావటం ఆనందకరం అలాగే వీరి చేతులమీదుగా ప్రముఖులకు జ్ఞాపికలను బహుకరించటం సంతోషకరం.
7. చివరిగా … దర్శకులమీద ఎంతో అభిమానంతో అడగ గానే విచ్చేసి మా సత్కారాన్ని సాదరంగా స్వీకరించి తన స్పీచ్ లో తాను ఉత్తమ నటునిగా నేషనల్ అవార్డు గెలుచుకున్నతర్వాత మొదటి సన్మానం అని సభాముఖంగా శ్రీ అల్లు అర్జున్ గారు తెలియజేయడం అత్యంత ఆనంద దాయకం.
తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ ప్రోగ్రాం చేసుకుని ఘణవిజయం పొందామని ఆనందంగా తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమం తలపెట్టినప్పటి నుండి తమ సమయాన్ని వెచ్చించి ప్రోగ్రాం ని అందంగా తీర్చి దిద్దడానికి అహర్నిషలు శ్రమించి… స్కిట్లు, డాన్స్ లు, పాటలతో నింపిన అందరికీ అభినందనలు కృతజ్ఞతలు.
చిత్ర ప్రముఖులు ప్రసాద్ లాబ్స్ అధినేత శ్రీ రమేశ్ ప్రసాద్ గారు, దర్శకుల సంఘం పూర్వ అధ్యక్షులు సీనియర్ డైరెక్టర్స్ శ్రీయుతులు తమ్మారెడ్డి భరద్వాజ గారు, ఎస్వీ కృష్ణా రెడ్డి గారు, ఎన్ శంకర్ గార్ల తో పాటుగా కీర్తిశేషులు కృష్ణం రాజుగారి సతీమణి శ్రీమతి శ్యామల గారు, రేలంగి నరసింహారావు గారు, ప్రముఖ నిర్మాత లు, ప్రముఖ హీరోలు, ప్రముఖ బిజినెస్ మెన్ మరియుTFDA కమిటీ సభ్యులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తో ప్రారంభమయింది.
# తదుపరి శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో లేడీ డైరెక్టర్స్ పియదర్శిని కృష్ణ, గౌరి రోణంకి, ప్రవీణలు ఆహుతులకు ఆహ్వానం పలికారు.
# తదుపరి …హాపనింగ్ డైరెక్టర్స్ ఆనిల్ రావిపూడి, నందిని రెడ్డి బృందం స్కిట్ తో ఉర్రూతలు ఊగించారు.
# సీనియర్ డైరెక్టర్ రాజా వన్నెంరెడ్డి బృందం మరో స్కిట్ తో ప్రేక్షకులను రంజింపజేసారు.
# ఎనర్జిటిక్ డాన్స్ లు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యంగ్‌డైరెక్టర్స్ శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, శివ నిర్వాణ.
# తమ పాటలతో ఉత్తేజపరిచిన సింగర్స్ మంగ్లీ, హర్షవర్థన్, సింహ.
తెలుగు సినిమా దర్శకుల సంఘం చరిత్రలో మొదటి సారిగా ‘Award to Debut Director’ and 1 lakh cash prize ని ప్రవేశపెట్టి ముగ్గురు ఉత్తమ తొలి దర్శకులను ఎంపిక చేసి మేటి చిత్రాలకు అవార్డులు ప్రధానం చేసాము.
1. బలగం – వేణు యెల్డండి
2. దసరా- శ్రీకాంత్ ఓదెల
3. హలో మీరా- శ్రీనివాస్ కాకర్ల
TFDA సభ్యుల ప్రగతి కోసం స్పాన్సర్స్ ద్వారా నలుగురు మెంబర్స్ కి లక్కీ డిప్ ద్వారా నాలుగు(121 sq adds) ఓపెన్ ప్లాట్లను ప్రధానం చేసాము.
ఈ కార్యక్రమానికి ఎందరో పేరెన్నికగన్న హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు విచ్చేసి ఘణవిజయం చేసినందుకు వారికి కూడా పేరుపేరునా పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
భవిష్యత్తులో మేము చేయబోయే ప్రతీ కార్యక్రమాలకు మీ అందరి నుండి ఇలాగే సహాయసహకారాలు లభించగలవని ఆశిస్తున్నామన్నారు.