ఢిల్లీ బాటపట్టనున్న పసుపు రైతులు..

345
farmers
- Advertisement -

దేశవ్యాప్తంగా పసుపుకు మద్దతు ధరతో పాటు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని కొంతకాలంగా ఆందోళన చేస్తున్న పసుపు రైతులు వారణాసి బాటపట్టిన సంగతి తెలిసిందే. అయితే మోడీపై పోటీకి దిగిన ఆర్మూర్ పసుపు రైతులకు చుక్కెదురయింది. నామినేషన్ల పరిశీలనలో 24 మంది రైతుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా ఒకే ఒక రైతు ఇస్తారి నామినేషన్ మాత్రమే అమోదం పొందింది.

దీంతో ఢిల్లీ బాట పట్టనున్న పసుపు రైతులు ఈ నెల 3న వారణాసి ఎన్నికల సంఘం అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.మొత్తం వారణాసిలో 119 నామినేషన్లు దాఖలుగా కాగా.. ఏకంగా 89 నామినేషన్లను అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. రైతుల నామినేషన్లతో పాటు బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ తేజ్‌బహుదూర్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం మోడీ సహా 30మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

వారణాసిలో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన రైతులకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురయ్యాయి. రైతులు నామినేషన్ దాఖలు చేయకుండా స్ధానిక బీజేపీ నేతలు అడ్డుకున్నారు. వీరికి తోడు పోలీసులు కూడా ఓవరాక్షన్ చేయడంతో వారణాసి కలెక్టరేట్‌ ద్వారం వద్ద, రైఫెల్‌ క్లబ్‌ వద్ద ఆందోళన చేపట్టారు. చివరకు సరైన పత్రాలు లేవంటూ రైతుల నామినేషన్లను అధికారులు తిరస్కరించడంతో హస్తినలో పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు రైతులు.

- Advertisement -