జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు..

197
ec
- Advertisement -

జిహెచ్ఎంసీ ఎన్నికలలో అభ్యర్థులను బలపరిచే వ్యక్తి సంబంధిత వార్డులో ఓటరై ఉండాలని, ఎటువంటి అనర్హతలు కలిగి ఉండరాదని, ఈ విషయంలో స్పష్టతనిస్తూ ఎన్నికల అధికారులకు అధికార పూర్వక ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు. శుక్రవారం (13-11-2020) ఒక ప్రకటన విడుదల చేస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు, బలపరిచే వ్యక్తుల అర్హతలపై జీహెచ్ఎంసీ చట్టం, 1955 సెక్షన్ 36 లోని సబ్ సెక్షన్ 2 మరియు 7 క్రింద అధికార పూర్వక ఆదేశాలు ఈ క్రింది విధంగా జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.

– జీహెచ్ఎంసీ ఎన్నికలలో బలపరిచే వ్యక్తి అభ్యర్థి పోటీ చేస్తున్న వార్డులో రిజిస్టర్ కాబడిన ఓటరై ఉండాలి.

– పోటీ చేస్తున్న అభ్యర్థి జీహెచ్ఎంసీ పరిధిలోని ఏదైనా వార్డునందు రిజిస్టర్ కాబడిన ఓటరు అయిఉండాలి. అట్టి అభ్యర్థి తాను రిజిస్టర్ కాబడిన వార్డుకు సంబంధించిన పూర్తి ఓటరు లిస్టు గాని, అభ్యర్థి పేరు ఉన్న భాగాన్ని గాని అధీకృత అధికారిచే ధృవీకరించబడిన కాపీని నామినేషన్ తో పాటు సమర్పించాల్సి ఉంటుంది.

– అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక అభ్యర్థి ఒకటికంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్ దాఖలు చేయవచ్చునుగాని, అంతిమంగా ఒక్క వార్డులో మాత్రమే పోటీ చేయవలసి ఉంటుందని, మిగిలిన వార్డులలో అభ్యర్థిత్వాన్ని నిర్ణీత గడువులోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని, లేని పక్షంలో అట్టి అభ్యర్థి నామినేషన్ ను ఏ వార్డులోనూ పరిగణనలోకి తీసుకోబడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.

- Advertisement -