పదిలో పదకొండు కాదు..ఆరు పేపర్లు

116
- Advertisement -

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు చాలా నష్టపోయారు. మహమ్మారి కారణంగా విద్యాసంవత్సరం కోల్పోపోవడమే గాకుండా విద్యార్థుల్లో విద్యా నాణ్యత కూడా తగ్గిపోయింది. ప్రపంచమే కాదు తెలంగాణ కూడా అందుకు మినహాయింపు లేకుండా పోయింది. తెలంగాణలోని విద్యార్థులు గడిచిన 2సంవత్సరాలుగా తీవ్రంగా నష్టపోయారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11పేపర్లకు బదులుగా 6పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని స్కూల్‌ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా వల్ల గతేడాది కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. తాజాగా పదో తరగతి పరీక్షలపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం… ఈ ఏడాది కూడా 6 పేపర్లతో పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులపై భారం పడకుండా 2021-2022 విద్యా సంవత్సరంలో టెన్త్ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించారు.

గ‌తంలో తెలుగు, ఇంగ్లీష్‌, గ‌ణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను రెండు పేప‌ర్లుగా పరీక్ష నిర్వహించేవారు. హిందీ స‌బ్జెక్ట్‌కు ఒకే ప‌రీక్ష ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఈ ఏడాది నుంచి ప్రతి సబ్జెక్ట్ కు ఒకటే పేపర్ ఉండనుంది.

ఇవి కూడా చదవండి..

తెలంగాణలో మీ గుండాయిజం చెల్లదు:కేటీఆర్‌

- Advertisement -