రాష్ట్రంలో మీ గుండాయిజం చెల్లదు..

189
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో చివరి రోజున పలివెల గ్రామంలో బీజేపీ గుండాలు చేసిన దాడి వల్ల టీఆర్ఎస్‌ కార్యకర్తలకు గాయాలపాలైన సంగతి తెలిసింది. పలివెల గ్రామంలో జరిగిన బీజేపీ గుండాల దాడిలో గాయపడిన ములుగు జ‌డ్పీ చైర్మ‌న్ కుసుమ జ‌గ‌దీశ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ హోం మంత్రి మహమూద్ అలీ పరామర్శించారు.

అనంతరం మీడియాతో కేటీఆర్‌ మాట్లాడుతూ… హింసకే పాలుపాడుతామనే సిద్ధాంతం మీది ఏదైతో ఉందో…దాన్ని తిప్పికొట్టే శక్తి సత్తా మాకు ఉందన్నారు. కానీ మధ్యలో నలిగిపోయేది ప్రజలని అందుకే మేం సంయనం పాటిస్తే మా మీద గుండాలతో దాడి చేయించడం సరికాదన్నారు.

హింస దేనికి పరిష్కారం కాదని సూచించారు. చిల్లర పనులు, మాటలు ప్రచారాలు బంద్‌ చేయాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మీ చిల్లర మాటలతో తెలంగాణలో అగ్గిరాజేసే ప్రయత్నం జేస్తే మీకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

మునుగోడులో పరాభవం తప్పదని తెలిసే అమిత్‌షా మీటింగ్‌ రద్దు చేసుకున్నాడు. జేపీ నడ్డా కూడా రాలేదని దుయ్యబట్టారు. మీపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. అందుకే దాడులకు పాల్పడుతున్నారు. బెంగాల్‌లో మీ వ‌ల్లే హింస ప్రారంభ‌మైంది.

శ‌వాల మీద పేలాలు ఏరుకునే దౌర్బాగ్య సంస్కృతి బీజేపీ పార్టీది. ఈ రాజ‌కీయం బీజేపీకే సాధ్య‌మైత‌ది. నిన్న ప‌లివెల‌లో 12 మంది టీఆర్ఎస్ నాయ‌కుల‌ను గాయ‌ప‌రిచారు. ఇదే సంస్కృతిని కొన‌సాగిస్తే మేం తిర‌గ‌బ‌డ‌క త‌ప్ప‌దు. బుద్ది చెప్ప‌క త‌ప్పదు. సానుభూతి నాట‌కాలు మంచిది కాదు అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

గత 8ఏండ్లలో ఉద్రిక్తతకు తావు ఇవ్వలేదు

2001 నుంచి 2014 వ‌ర‌కు 14 ఏండ్ల పాటు ఎన్నో భావోద్వేగాల మ‌ధ్య‌న‌, ఎన్నో ర‌కాల ఒత్తిళ్ల మ‌ధ్య తెలంగాణ ఉద్య‌మాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లామ‌ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్క చుక్క ర‌క్తం కూడా చిందించ‌కుండా, ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తుల్లోనే తెలంగాణ సాధించాల‌నే నిబద్ధ‌త‌తో, చిత్త‌శుద్ధితో, అన్ని ర‌కాల అవ‌రోధాల‌ను త‌ట్టుకోని ధీరోదాత్తంగా ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తుల్లోనే తెలంగాణ సాధించింది టీఆర్ఎస్ పార్టీ. ఆ ఉద్య‌మానికి కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌హించారు అని మంత్రి గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఎన్న‌డూ కూడా కొట్లాట‌లు, హింస‌ల‌కు తావు ఇవ్వ‌లేదు. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత గ‌త 8 ఏండ్ల‌లో ఎక్క‌డ ఎన్నిక జ‌రిగినా కూడా ఉద్రిక్త‌త‌కు తావు ఇవ్వ‌లేదని కేటీఆర్ తెలిపారు. కానీ మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ గుండాయిజం చేయడం సిగ్గుచేటన్నారు.

రెచ్చగొట్టే మాటలను సహించం

ఈ బీజేపీ నాయ‌కులు వారి ఆగ‌డాలు, ముఖ్యంగా ఇవాళ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం హింస‌ను రెచ్చ‌గొట్టారని మండి పడ్డారు. శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌ను సృష్టించాల‌నే వ్యూహంతో దానిక‌నుగుణంగానే నిన్న ప‌లివెల‌లో పెద్ద ఎత్తున రాజేంద‌ర్ నాయ‌క‌త్వంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు దిగారు.

ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ములుగు జ‌డ్పీ చైర్మ‌న్ కుసుమ జ‌గ‌దీశ్ తో పాటు 12 మంది కార్య‌క‌ర్త‌ల త‌ల‌లు ప‌గ‌లుగొట్టారు. క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. మొత్తం ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఎవ‌రు ఎవ‌రి మీద దాడి చేశార‌నే ఆధారాలు ఉన్నాయి.

ఈటల రాజేంద‌ర్ పీఏ న‌రేశ్ అనే వ్య‌క్తి రాళ్ల‌తో దాడి చేసిన ఫోటోలు ఉన్నాయి. మా ప్ర‌చారం మేం చేసుకుంటుంటే మాపై దాడి చేసి, సానుభూతి కోసం నాట‌కాలు ఆడుతున్నారు. మీరు పిడికెడంత మంది ఉన్నారు. మాకు 60 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్తలు ఉన్నారు. రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడితే.. స‌హించం అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి..

మునుగోడులో బీజేపీ గుండాయిజం..టీఆర్‌ఎస్‌పై దాడి

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

- Advertisement -