టీఎస్ ఈసెట్‌ ఫలితాలు రిలీజ్..

158
telangana ecet
- Advertisement -

తెలంగాణ ఇంజినీరింగ్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఈసెట్‌) ఫ‌లితాలను విడుదల చేశారు ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ తుమ్మ‌ల పాపిరెడ్డి. ఈసెట్‌లో 97.58 శాతం మంది ఉత్తీర్ణుల‌య్యారని….. ప‌రీక్ష రాసిన విద్యార్థులు త‌మ ఫ‌లితాల‌ను అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inలో చూసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు.

ఆగస్టు 31న ఈ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించగా ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష ద్వారా డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసిన‌వారికి ఇంజినీరింగ్ రెండో సంవ‌త్స‌రంలోకి ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. అదేవిధంగా బీఫార్మ‌సీ కోర్సుల్లో లేట‌ర‌ల్ ఎంట్రీ క‌ల్పిస్తుంది.

- Advertisement -