మొక్కలు నాటిన నటుడు కల్కి రాజ్..

153
Kalki Raja

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు నాగబాబు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన నటుడు కల్కి రాజ్.

ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో సోషల్ మీడియా వేదికగా తెలపడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా తన సహచర నటులు పవన్ సాయి (ముద్దమందారం సీరియల్), కృష్ణ కిషోర్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.