- Advertisement -
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ పరీక్ష నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నందున్న రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రోఫెసర్ లింబాద్రి ప్రకటించారు. ఈనెల 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ పరీక్షను యథాతథంగా ఉంటుందని తెలిపారు. అగ్రికల్చర్ పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వంతో సంప్రదించి అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేసి…. ఇంజినీరింగ్ పరీక్షను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించారు.
- Advertisement -