సమన్వయంతో పనిచేయాలి : మంత్రి వేముల

82
vemula
- Advertisement -

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వర్షాలపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లతో బుధవారం మంత్రి వేముల ఫోన్ చేసి సమాచారం అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలుగు పొస్తున్న చెరువుల వద్దకు, పొంగి పొర్లుతున్న కల్వర్టుల వద్దకు కొంత మంది ఆసక్తితో చూడడానికి వెళ్తారని, ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

విద్యుత్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలన్నారు. అవసరం ఉన్న చోట వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు. విద్యుత్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, గ్రామ స్థాయిలోని సిబ్బంది 24 గంటల పాటు అలెర్ట్ గా ఉండాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షించాలని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

- Advertisement -