భారత ప్రభుత్వం ఈ యేడాది సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్న జీ20 సమావేశాల జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నిర్వహించనున్న వేళ…భద్రతపై డీజీపీ కార్యాలయంలో అంజనీకుమార్ అధ్యక్షతన జీ20 సెక్యూరిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ నెల 28నుంచి జూన్17 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి.
జీ20 సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56నగరాల్లో 215వర్కింగ్ గ్రూప్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో 6సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. జనవరి 28న తొలి సమావేశం జరగనుండగా, మార్చి 6,7, ఏప్రిల్ 26, 27, 28, జూన్ 7, 8, 9, జూన్ 15, 16 ,17న వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…జీ20 సమావేశాలు సజావుగా, ఎలాంటి భద్రతాపరమైన అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని అంజనీకుమార్ అన్నారు. ఈ సమావేశాలకు హాజరయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రతీ ఒక్కరి యాంటిడేన్స్‌లను పక్కాగా పరిశీలించాలని కోరారు. ప్రధానంగా ఎయిర్‌పోర్ట్, ప్రతినిధులు బస చేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్‌తో పాటు నగరంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, విజయ కుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు, హోం మంత్రిత్వ శాఖ ఎస్‌ఐబీ డీడీ సంబల్ దేవ్, రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ జీఎస్‌ఓ భారత్ కందార్, డిప్యూటీ పాస్ పోర్ట్ ఆఫీసర్ ఇందు భూషణ్ లెంక, ఎన్డీఆర్‌ఎఫ్ దామోదర్ సింగ్, సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన సింగన రామ్, ఎన్ఎస్‌జీ కల్నల్ అలోక్ బిస్త్, జీఏడీ ప్రోటోకాల్ అధికారి కే తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…