మండలి సభ్యుల పదవి విరమణ

3
- Advertisement -

తెలంగాణ శాసన మండలి సభ్యులుగా పదవీ విరమణ పొందుతున్న సభ్యులకు ఘనంగా వీడ్కోలు పలికారు.
1) ఎమ్. ఏస్ ప్రభాకర్ రావు ,
2) మహమ్మద్ మహమూద్ అలీ
3) టి .జీవన్ రెడ్డి
4) ఎగ్గే మల్లేశం
5) అలుగుబెల్లి నర్సిరెడ్డి
6) శేరి శుభాష్ రెడ్డి
7) కూర రఘోత్తము రెడ్డి
8) సత్యవతి రాథోడ్
9) మీర్జా రియజుల్ హాసన్ ఎఫ్ఎండి
వీరిను ఘనంగా సత్కరించి , సన్మానించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏ . రేవంత్ రెడ్డి , రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు , డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , శాసన సభ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనా చారి , తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా’ నరసింహా చార్యులు తదితరులు ఉన్నారు.

Also Read:కేంద్రంపై పోరు..మేము మద్దతిస్తాం:కేటీఆర్

ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ” చట్టసభల్లో అడుగుపెట్టే అదృష్టం కేవలం కొందరికి మాత్రమే వస్తోందని, ఆ అదృష్టవంతుల్లో ఉండటం గొప్ప విషయం అని తెలిపారు.పదవీవిరమణ పొందుతున్న 9 మంది సభ్యులు కూడా ప్రజలకు ఎంతో సేవచేసారని అన్నారు. పదవిలో ఉన్న లేకున్నా ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయమని తెలిపారు. చట్ట సభల్లో అనర్గళంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కృషి చేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు .

- Advertisement -