గాంధీ నుంచి హైదరాబాద్ టెకీ డిశ్చార్జ్

276
coronavirus
- Advertisement -

కరోనా బారీన పడిన హైదరాబాద్ టెకీ పూర్తిగా కోలుకున్నారు. కరోనాను జయించి గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని..ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దని డాక్టర్లు ఆ టెకీకి సూచించారు. 9 రోజుల చికిత్స అనంతరం పూర్తిగా కోలుకోవడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేయగా తెలంగాణ ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు.

మహేంద్రా హిల్స్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు మార్చి 1న కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అతను దుబాయ్ వెళ్లి ఫిబ్రవరి 19న బెంగళూరు వచ్చాడు. అక్కడి నుంచి ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు బస్సులో వచ్చాడు. జ్వరం,జలుబు ఎంతకీ తగ్గకపోవడంతో కరోనా లక్షణాలతో గాంధీలో చేరాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన డాక్టులు కరోనా అని తేల్చారు.

దీంతో ఆ వ్యక్తి కుటుంబసభ్యులతో పాటు బస్సులో ప్రయాణించిన వారికి టెస్టులు నిర్వహించారు. వారందరికి కరోనా నెగటివ్ అని తేలింది. తాజాగా ఆ టెకీ కూడా కరోనా నుండి బయటపడటంతో కాసింత ఉరట లభించింది.

- Advertisement -