దేశంలో రెండు టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కరోనా టీకా డ్రై రన్‌కు ఏర్పాట్లు చేస్తుండగా రాష్ట్రంలో కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7న డ్రై రన్ నిర్వహించనున్నారు.వ్యాక్సినేషన్ ప్రక్రియపై నేడు జిల్లా వైద్యాధికారులు, ఉప వైద్యాధికారులు, ఇతర అధికారులతో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. డ్రై రన్‌పై కీలక సూచనలు చేయనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ప్రజారోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు తెలిపారు.
7న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉదయం వెయ్యికిపైగా సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి కేంద్రంలో 25 మందికి డమ్మీ వ్యాక్సిన్ వేయనున్నారు. డ్రై రన్ నిర్వహించడం వల్ల వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీ విషయంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించడం సాధ్యమవుతుందని, నెట్వర్క్ సమస్యలు ఎదురుకాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు.