రాష్ట్రంలో 24 గంటల్లో 894 కరోనా కేసులు…

164
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్‌య 93 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 894 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 10 మంది మృతిచెందారు.

ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 92,255గా ఉండగా ఇప్పటివరకు 703 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,240 యాక్టివ్ కేసులుండగా 70,132 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.

జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను పరిశీలిస్తే ఒక్క గ్రేటర్ ‌హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 147 నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 85, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 51, భద్రాద్రి కొత్తగూడెంలో 9, ఖమ్మంలో 44, వరంగల్‌ అర్బన్‌జిల్లాలో 44, వరంగల్ ‌గ్రామీణ జిల్లాలో 9 చొప్పున, ఆదిలాబాద్‌ జిల్లాలో 10, జగిత్యాల జిల్లాలో 31, జనగామా జిల్లాలో 7, జోగుళాంబా గద్వాల జిల్లాలో 21, నల్గొండ జిల్లాల్లో 37, కామారెడ్డి జిల్లాల్లో 7, సిద్దిపేట జిల్లాల్లో 58 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8794 మందికి కొవిడ్ -19 ‌పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,53,349 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.

- Advertisement -