ఒక్కరోజే 1410…గ్రేటర్‌లో 918

161
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలు దాటాయి. గురువారం ఒక్కరోజే 1,410 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30,946కి చేరగా 331 మంది ప్రాణాలు కొల్పోయారు.

తెలంగాణలో ఇప్పటివరకు 1,40,755 మందికి కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా నుండి కొలుకోని 18,192 మంది డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో 17,081 బెడ్లు సిద్దంగా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక గురువారం నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 918 ఉన్నాయి. జిల్లాలవారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో 125, సంగారెడ్డి 79, మేడ్చల్‌ మల్కాజిగిరి 67, వరంగల్‌ అర్బన్‌ 34, కరీంనగర్‌ 32, భద్రాద్రి కొత్తగూడెం 23, నల్లగొండ 21, నిజామాబాద్‌ 18, మెదక్‌ 17, ఖమ్మం 12, సూర్యపేట 10, మహబూబ్‌నగర్‌, రాజన్న సిరిసిల్ల 8 చొప్పున, వరంగల్‌ రూరల్‌ 7, జయశంకర్‌ భూపాలపల్లి 6, వికారాబాద్‌, మహబూబాబాద్‌లో 5 చొప్పున, జోగుళాంబ గద్వాల, వనపర్తి, జనగామ, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి 2 చొప్పున, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

- Advertisement -