బాహుబలి @ 5

256
prabhas
- Advertisement -

బాహుబలి…..తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ. పాన్ ఇండియా మూవీగా రాజమళి దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ రికార్డులను సైతం తిరగరాసింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సినిమా షూటింగ్ జరుగగా సినిమా విడుదలైన తర్వాత చిత్రయూనిట్ పడిన కష్టాన్ని మొత్తం మర్చిపయింది.

ప్రభాస్, రానా అద్బుత నటనకు తోడు విజువల్ గ్రాఫిక్స్, సెంటిమెంట్, ఫైట్స్, పాటలు ఇలా ప్రతిఒక్కటి సాధారణ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా తెరకెక్కించారు జక్కన్న. సినిమా రిలీజ్‌కు ముందే క్రియేట్ అయిన హైప్‌కు ఏమాత్రం తీసిపోకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.దాదాపు రూ. 3 వేల కోట్ల వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.

అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయగా రానా భ‌ళ్ళాల‌దేవుడిగా, అనుష్క దేవ‌సేన‌గా, ర‌మ్య‌కృష్ణ రాజ‌మౌత శివ‌గామిగా, స‌త్య‌రాజ్ క‌ట్ట‌ప్పగా, త‌మ‌న్నా అవంతిక పాత్ర‌ల‌లో నటించి మెప్పించారు. ఇక సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తైన సంద‌ర్భంగా ప్రత్యేక వీడియోని విడుదల చేసింది చిత్రయూనిట్.

- Advertisement -