తెలంగాణ కరోనా అప్‌డేట్..

26
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 205 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,068కి చేరుకున్నాయి.

కరోనా నుండి ఇప్పటివరకు 2,77,304 మంది కోలుకోగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌తో 1533 మంది మృతిచెందారు. దేశంలో కరోనా మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గిందని వైద్య,ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో 27,244 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.