రాష్ట్రంలో 24 గంటల్లో 1416 కరోనా కేసులు..

115
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,416 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,048కు చేరాయి.

ఇప్పటి వరకు 2,20,466 మంది కరోనా నుండి కోలుకోగా 1341 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,241 యాక్టివ్ కేసులుండగా కరోనా మరణాల రేటు భారత్‌లో 1.5 శాతంగా ఉంటే… రాష్ట్రంలో 0.55 శాతానికి పడిపోయింది.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 41,675 కరోనా టెస్టులు చేయగా రికవరీ రేటు దేశవ్యాప్తంగా 91.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 91.84 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -